Kaviti: కవిటిలో మృతుని కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం!

Kaviti: కవిటిలో విద్యుత్ షాక్‌తో యువకుడు మోహన్ మృతి. బాధితురాలైన పారిశుధ్య కార్మికురాలి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Aug 2026 12:13 PM IST
Kaviti
X

Kaviti: కవిటిలో మృతుని కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం!

Kaviti: కవిటి గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న లిమ్మయి రుక్మిణి కుమారుడు లిమ్మయి మోహన్ ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పాండవ శేఖర్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్పు తెలిపారు.

మోహన్ పెద్దకర్మ కార్యక్రమం నిమిత్తం తనవంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story