Sompeta: బెల్లుపడ మాజీ సర్పంచ్ రౌతు కుమారి అకస్మిక మృతి!

Sompeta: కంచిలి మండలం బెల్లుపడ మాజీ సర్పంచ్ రౌతు కుమారి అకస్మిక మృతి పట్ల ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం, టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 14 Oct 2026 9:33 AM IST
Sompeta
X

Sompeta: బెల్లుపడ మాజీ సర్పంచ్ రౌతు కుమారి అకస్మిక మృతి!

Sompeta: కంచిలి మండలం బెల్లుపడ గ్రామ మాజీ సర్పంచ్ రౌతు కుమారి (58) అకస్మికంగా మరణించడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బుడ్డేపు కామేశ్వర్ రెడ్డి, టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు ఆధ్వర్యంలో నాయకులు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి రౌతు కుమారి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి, హరిబాబు, మద్దిల భాస్కర్, సూర్యనారాయణ రెడ్డి, పైల రామారావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET