Palakonda: ఆపదలో అండగా.. వివేకానంద పూర్వ విద్యార్థుల గొప్ప మనసు
Palakonda: పాలకొండలో ప్రమాదవశాత్తు గాయపడిన లక్ష్మీకాంత్‌కు వివేకానంద హైస్కూల్ పూర్వ విద్యార్థుల సాయం.
Palakonda: ఆపదలో అండగా.. వివేకానంద పూర్వ విద్యార్థుల గొప్ప మనసు
Palakonda: పాలకొండ లోని ముదునూరువారి వీధికి చెందిన లక్ష్మికాంత్ ప్రమాదవశాత్తు మేడ మీదనుండి జారిపడి తీవ్రంగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఘటనతో చలించిపోయిన వివేకానంద హైస్కూల్ పూర్వ విద్యార్దులు దాదాపు 2,20,000 మొత్తం విరాళంగా అందించి తమ గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మొత్తాన్ని వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ గవర పారినాయుడు, డైరెక్టర్స్, ప్రముఖ వ్యాపారవేత్త తుమ్మగుంట శంకరరావు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల చేతుల మీదుగా లక్ష్మీకాంత్ తల్లిదండ్రులకు అందించారు. విద్యార్థుల ఔదార్యాన్ని పలువురు కొనియాడారు.
Next Story




