Pragadaputtuga: గణేష్ యూత్ మానవత్వం: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం!

Pragadaputtuga: కవిటి మండలం ప్రగడపుట్టుగలో కిడ్నీ వ్యాధితో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి గణేష్ యూత్ చేయూత. ఆ కుటుంబానికి రూ.40,200 ఆర్థిక సాయం అందజేత.

G.RAMBABU, SOMPET
Published on: 22 Aug 2026 10:39 AM IST
Pragadaputtuga
X

Pragadaputtuga: గణేష్ యూత్ మానవత్వం: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం!

Pragadaputtuga: కవిటి కిడ్నీ వ్యాధితో కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబానికి కవిటి మండలం ప్రగడపుట్టుగ గణేష్‌ యూత్‌ సభ్యులు అండగా నిలిచారు. కవిటి మండలం ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన సోమేష్‌ ధోలోయే (45) ఇటీవల కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు.

రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సోమేష్‌ మృతితో కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండటంతో కుటుంబ పరిస్థితిని గుర్తించిన గణేష్‌ యూత్‌ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు.

తమ వంతు సాయంగా రూ.40,200ను శనివారం సోమేష్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన గణేష్‌ యూత్‌ సభ్యులను గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో ప్రగడపుట్టుగ గణేష్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story