Srikakulam: ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు ఇద్దరి అరెస్ట్!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2.5 కేజీల గంజాయి స్వాధీనం. ఒడిశా నుండి తమిళనాడుకు తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు: సీఐ చిన్నమనాయుడు వెల్లడి.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 2 Sept 2026 3:23 PM IST
Srikakulam
X

Srikakulam: ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు ఇద్దరి అరెస్ట్!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఒడిశా నుంచి తమిళనాడుకు ఇచ్చాపురం మీదుగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు.

తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా వెల్లోడు గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో పాటు ఓ మైనర్ బాలుడు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇచ్చాపురం పట్టణ పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వీరి కదలికలపై అనుమానం రావడంతో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో 2 కిలోల 500 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద ఉన్న ఒక సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చాపురం సీఐ చిన్నమనాయుడు తెలిపారు. మైనర్ బాలుడికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram

Next Story