Sompeta: సోంపేటలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న సతీమణి యశోదమ్మ జయంతి!

Sompeta: సోంపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ (TDP) ఆధ్వర్యంలో స్వర్గీయ గౌతు యశోదమ్మ జయంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు.

G.RAMBABU, SOMPET
Published on: 12 July 2026 4:16 PM IST
Sompeta
X

Sompeta: సోంపేటలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న సతీమణి యశోదమ్మ జయంతి!

Sompeta: సోంపేట పట్టణంలో సర్దార్ గౌతు లచ్చన్న సతీమణి స్వర్గీయ యశోదమ్మ జయంతి వేడుకలను తెలుగుతమ్ముళ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. యశోదమ్మ గారు ప్రజాసేవలో, సామాజిక కార్యక్రమాల్లో చూపిన చొరవను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. వారి సేవలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని కొనియాడారు.

అనంతరం అందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బీన ఆనందరావు, పట్టణ అధ్యక్షుడు చిత్రాడ శేఖర్, బీన ఈశ్వర్, చిత్రాడ శ్రీను, పొందూరు రాజు, దున్న జోగారావు, మడ్డు రాజారావు, కాంచన రాఘవదాస్, దున్న ప్రకాష్, ఆదినారాయణ, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story