Srikakulam: ప్రభుత్వ బడి విద్యార్థిని ఘనత APRJCలో హాసిని సత్తా!

Srikakulam: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ స్థాయిలోనైనా రాణించగలరని హాసిని నిరూపించింది.

G.RAMBABU, SOMPET
Published on: 14 May 2026 3:34 PM IST
Srikakulam
X

Srikakulam: ప్రభుత్వ బడి విద్యార్థిని ఘనత APRJCలో హాసిని సత్తా!

శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అవకాశాలు కల్పిస్తే ఏ స్థాయిలోనైనా రాణించగలరని మరోసారి నిరూపించింది సింహాద్రి హాసిని. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో మండల టాపర్‌గా నిలిచి తన గ్రామంతో పాటు ప్రభుత్వ పాఠశాల పేరును జిల్లా స్థాయిలో వినిపించిన హాసిని, ఇప్పుడు ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షల్లో 562 ర్యాంక్ సాధించి మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది.

అంతేకాకుండా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో కూడా 1200 ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. సోంపేటలోని నర్గీత శిక్షణ సంస్థలో కోచింగ్ తీసుకోవడం తన విజయానికి ఎంతో దోహదపడిందని హాసిని పేర్కొంది. శిక్షణ సంస్థ బోధనా విధానం, ఉపాధ్యాయుల క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి ప్రధాన కారణమని తెలిపింది.

ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నర్గీత శిక్షణ సంస్థ కరస్పాండెంట్, డైరెక్టర్ సంగీత పండా, నరేష్ పండా హాసినిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సుమారు రూ.5 వేల విలువైన విద్యా పరికరాలను అందజేశారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమేశ్వరరావు, చంద్రశేఖర్‌తో పాటు ఉపాధ్యాయులు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో నిరంజన్ కడంగా, భాషా ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story