Srikakulam: గణనాథుని సన్నిధిలో భక్తి స్వరాలు: మకరాంపురంలో భజనలు

Srikakulam: కంచిలి మండలం మకరాంపురం బాలక వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

G.RAMBABU, SOMPET
Published on: 15 Sept 2026 7:30 PM IST
Srikakulam
X

Srikakulam: గణనాథుని సన్నిధిలో భక్తి స్వరాలు: మకరాంపురంలో భజనలు

శ్రీకాకుళం: కంచిలి మండల పరిధిలోని మకరాంపురం గ్రామం బాలక వీధిలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా వినాయకుని సన్నిధిలో నిర్వహించిన భజన కార్యక్రమంతో బాలక వీధి భక్తిమయంగా మారింది.

ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి నైవేద్యం సమర్పించిన కమిటీ సభ్యులు, సాయంత్రం భక్తి గీతాలు, భజనలతో స్వామివారిని కొలిచారు. గణపతి నామస్మరణతో వీధి మార్మోగగా, భక్తులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు. చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా భజన కార్యక్రమంలో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు.

భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలక వీధిలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET