Parvathipuram Manyam: 15 మండలాలకు డేంజర్ హీట్ అలర్ట్

Parvathipuram Manyam: మన్యం జిల్లాలో 15 మండలాల్లో హీట్ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 11 May 2026 5:46 PM IST
Parvathipuram Manyam
X

Parvathipuram Manyam

Parvathipuram Manyam: రియల్ టైమ్ గవర్నెన్స్ తాజా నివేదిక ప్రకారం, మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల వాతావరణ సూచనలు విడుదలయ్యాయి. జిల్లాలో వర్ష సూచన ఏమీ లేనప్పటికీ, ఎండల తీవ్రత (హీట్ ఇండెక్స్ ) ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్ది హెచ్చరించారు.

​ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం, జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది. హీట్ ఇండెక్స్ 41°C నుండి 54°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది, దీనిని వాతావరణ శాఖ 'డేంజర్ కేటగిరీ' (ప్రమాదకర స్థాయి) గా గుర్తించిందన్నారు..

ఎండల ప్రభావం అధికంగా ఉండే 15 మండలాలు

​కురుపాం, ​గుమ్మలక్ష్మీపురం, ​సీతానగరం, ​సాలూరు, ​పాచిపెంట, ​మక్కువ, ​సీతంపేట, ​భామిని, ​కొమరాడ, ​వీరఘట్టం,​బలిజిపేట, ​జియ్యమ్మవలస, ​పార్వతీపురం, ​గరుగుబిల్లి, ​పాలకొండ. ఉష్ణోగ్రతలు మరియు హీట్ ఇండెక్స్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్ది సూచించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story