Srikakulam: కంచిలిలో పోలీసుల మెరుపు దాడులు: భారీగా కార్డన్ సెర్చ్!

Srikakulam: కంచిలి బీపీ కాలనీలో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్. పాత నేరస్తుల ఇళ్లల్లో సోదాలు, నిబంధనలు లేని వాహనాలు సీజ్.

G.RAMBABU, SOMPET
Published on: 26 April 2026 10:13 AM IST
Srikakulam
X

Srikakulam: కంచిలిలో పోలీసుల మెరుపు దాడులు: భారీగా కార్డన్ సెర్చ్!

Srikakulam: కంచిలి మండల కేంద్రం బీపీ కాలనీలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలాస డీఎస్సీ భవాని స్వీయంగా పాల్గొని పర్యవేక్షించారు. శనివారం ఉదయం నుంచి కాలనీని తమ ఆధీన లోకి తీసుకున్న పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అనుమానితులు, పాత నేరస్తులు, రౌడీషీటర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. వాహనాల రికార్డులు, పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా డీఎస్సీ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ

ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం

కర్తవ్యమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరిం చారు. నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరం గా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడ పొద్దని కోరారు. నీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డా యని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమా చారం ఇవ్వాలని కోరారు. తమపై వేధింపులను మహిళలు నిర్భ యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. యువత చదువుపై శ్రద్ధ వహించాలని చెప్పారు. వాహనాలు నడిపే వారు అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచు కోవాలని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. పలు వురితో పెండింగ్ చలాన్లు కట్టించారు. ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లో సోంపేట సీఐ మంగరాజు, స్థానిక ఎస్సైపీ పారినాయుడు, సోంపేట ఎస్సై మోహిని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story