Pathapatnam: పాతపట్నంలో వరద నీటిలో మునిగిన పంటలు, రోడ్లు
Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఎడతెరిపిలేని వర్షాలతో తిడ్డిమి, చాపర గ్రామాల్లో పంట పొలాలు, రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి.
Pathapatnam: పాతపట్నంలో వరద నీటిలో మునిగిన పంటలు, రోడ్లు
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం నియోజకవర్గ పరిధిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ పంట పొలాలను, రహదారులను ముంచెత్తుతున్నాయి.
పాతపట్నం మండలంలోని తిడ్డిమి గ్రామంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో పాటు ప్రధాని రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీనివల్ల వాహనదారులు, గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మరోవైపు గ్రామంలోని పంట పొలాల్లోకి కూడా నీరు చేరడంతో పైరు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే మెలియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో, పంటను కాపాడుకునేందుకు రైతులు ఆ నీటిని దిగువన ఉన్న పెద్ద చెరువులకు మళ్లిస్తున్నారు.
పొలాల్లో నీరు నిల్వ ఉంటే పైరు కుళ్ళిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.




