Srikakulam: దిక్కులేని వృద్ధుడికి కలెక్టర్ అండ.. సీతయ్య ఫౌండేషన్‌లో ఉచిత వసతి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్పందనతో గూనపాలెం గ్రామానికి చెందిన దుంగ కృష్ణ అనే వృద్ధుడికి కంచిలి మండపల్లి సీతయ్య ఫౌండేషన్‌లో ఆశ్రయం.

G.RAMBABU, SOMPET
Published on: 13 Aug 2026 9:11 PM IST
Srikakulam
X

Srikakulam: దిక్కులేని వృద్ధుడికి కలెక్టర్ అండ.. సీతయ్య ఫౌండేషన్‌లో ఉచిత వసతి!

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రతి గురువారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మానవత్వం చాటే ఘటన చోటుచేసుకుంది. గూనపాలెం గ్రామానికి చెందిన దుంగ చలమయ్య (లేటు) కుమారుడు కృష్ణ అనే వృద్ధుడు ఎటువంటి ఆధారం, ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామ పెద్దలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యపై వెంటనే స్పందించిన కలెక్టర్ విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీకి అంశాన్ని రిఫర్ చేశారు. ఏడీ స్వయంగా స్పందించి కంచిలి మండలం మండపల్లిలోని సీతయ్య ఫౌండేషన్ ను సంప్రదించారు. ఫౌండేషన్ తరపున సానుకూలంగా స్పందించిన అధ్యక్షుడు గుల్ల రమేష్.. దుంగ కృష్ణను తమ ఆశ్రమంలో చేర్చుకొని అన్ని సౌకర్యాలు కల్పించారు.

ఇకపై ఆయనకు ఆశ్రమంలోనే అన్ని సదుపాయాలతో కూడిన ఆశ్రయం లభించనుంది. ఈ సేవా కార్యక్రమంలో సహకరించిన కలెక్టర్, ఏడీకి సీతయ్య ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story