Ichchapuram: 13 రోజులకే పాస్‌పోర్ట్ - ప్రపంచ రికార్డు సృష్టించిన చిన్నారి

Ichchapuram: ఇచ్చాపురానికి చెందిన 13 రోజుల చిన్నారి అగస్య ప్రిన్సీ అతి చిన్న వయసులో పాస్‌పోర్ట్ పొంది ప్రపంచ రికార్డు సృష్టించింది.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 9 Sept 2026 7:38 PM IST
Ichchapuram
X

Ichchapuram: 13 రోజులకే పాస్‌పోర్ట్ - ప్రపంచ రికార్డు సృష్టించిన చిన్నారి

ఇచ్చాపురం: పుట్టి పక్షం రోజులు కూడా పూర్తికాకముందే ఆ చిన్నారి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 13 రోజుల వయసులోనే భారత పాస్‌పోర్ట్ పొంది అరుదైన ఘనత సాధించింది. ఇచ్చాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వజ్రపు వెంకటేష్ మనుమరాలు, ఆశీష్–గీతమాధురి దంపతుల కుమార్తె అగస్య ప్రిన్సీ ఈ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

గతంలో 19 రోజుల వయసులో పాస్‌పోర్ట్ పొందిన చిన్నారి పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అగస్య ప్రిన్సీ అధిగమించింది.

* రికార్డుల్లో స్థానం: అతి చిన్న వయసులో పాస్‌పోర్ట్ పొందిన చిన్నారిగా అగస్య ప్రిన్సీ సాధించిన ఈ ప్రతిభను ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థలు అధికారికంగా గుర్తించాయని తల్లిదండ్రులు తెలిపారు.

* పట్టణానికి గుర్తింపు: తమ కుమార్తె సాధించిన ఈ అరుదైన ఘనత ఇచ్చాపురం పట్టణానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం ఎంతో గర్వంగా ఉందని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ గుర్తింపు సాధించిన చిన్నారి అగస్య ప్రిన్సీకి, ఆమె కుటుంబ సభ్యులకు పట్టణ ప్రముఖులు, స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram

Next Story