Ichchapuram: ప్రజలకు చేరువగా సీఐ చిన్నమనాయుడు 'పల్లెనిద్ర'

Ichchapuram: ఇచ్చాపురం సీఐ చిన్నమనాయుడు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. కొలిగాం, తేలుకుంచి తదితర గ్రామాల్లో రాత్రి బస చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 31 Aug 2026 11:24 PM IST
Ichchapuram
X

Ichchapuram: ప్రజలకు చేరువగా సీఐ చిన్నమనాయుడు 'పల్లెనిద్ర'

ఇచ్చాపురం: ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో ఇచ్చాపురం సీఐ చిన్నమనాయుడు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఇచ్చాపురం రూరల్‌ పరిధిలోని కొలిగాం, తేలుకుంచి, లొద్దపుట్టి, కేసుపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు.

గ్రామాల్లో రాత్రి బస చేసిన సీఐ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితి, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, గంజాయి తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని, వాటిపై పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీఐ చిన్నమనాయుడు తెలిపారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram

Next Story