Ichchapuram: ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Ichchapuram: ఇచ్చాపురం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా సాలిన గణేష్ బాధ్యతలు స్వీకరించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 2 Oct 2026 11:44 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

ఇచ్చాపురం: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఇచ్చాపురం నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

స్థానిక శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మైలిపిల్లి రాజు ముఖ్య పర్యవేక్షకుడిగా హాజరై ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించారు. సభ్యులందరి ఆమోదంతో నూతన కమిటీని లాంఛనంగా ప్రకటించారు.

నూతన కార్యవర్గ సభ్యులు:

* గౌరవ అధ్యక్షులు: త్రినాథ్

* అధ్యక్షులు: సాలిన గణేష్

* ఉపాధ్యక్షులు: రాంబాబు

* కార్యదర్శి: కృష్ణతేజ

* సహాయ కార్యదర్శి: రాంబాబు

* కోశాధికారి (ట్రెజరర్): రవి ప్రసాద్

ఈ సందర్భంగా ఎన్నికైన నూతన ప్రతినిధులు మాట్లాడుతూ... నియోజకవర్గ పరిధిలోని పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. వృత్తిధర్మాన్ని కాపాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక ప్రముఖులు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

సమాజ హితం కోసం మీడియా మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram