Kaviti: కవిటి మండలంలో తీరిన నీటి కష్టాలు.. మంచినీటి కుళాయిలు ప్రారంభం!
Kaviti: ఇద్దివానిపాలెం గ్రామాల్లో రూ.7.80 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి కుళాయిలను ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు.
Kaviti: కవిటి మండలంలో తీరిన నీటి కష్టాలు.. మంచినీటి కుళాయిలు ప్రారంభం!
కవిటి: ఎన్నో ఏళ్లుగా తాగునీటి ఇబ్బందులతో బాధపడుతున్న కొత్తపాలెం, ఇద్దివానిపాలెం గ్రామాల ప్రజలకు ఊరటనిచ్చేలా మంచినీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి. కవిటి పంచాయతీ పరిధిలో రూ.7.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ తాగునీటి సదుపాయాలను ఆదివారం ఇచ్చాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ డా. బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు.
కొత్తపాలెంలో రూ.4.30 లక్షలు, ఇద్దివానిపాలెంలో రూ.3.50 లక్షలతో నిర్మించిన కుళాయిలను శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు ఇక గతం కావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ సదుపాయంతో తమ కష్టాలు తీరనున్నాయని పేర్కొంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మణి చంద్రప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ ఎర్ర బాసుదేవ్, మాజీ జెడ్పీటీసీలు బెందాళం రమేష్, పొందల కృష్ణారావు, కాలింగ్ కార్పొరేషన్ చైర్మన్ బార్ల చిన్నబాబు, పూడి ప్రవీణ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




