Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ‘టిడ్కో’ లబ్ధిదారులకు ఊరట!

Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో టిడ్కో గృహాల పథకంలో ఇళ్లు దక్కించు కోలేకపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా ధనాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ.

G.RAMBABU, SOMPET
Published on: 15 July 2026 8:33 AM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ‘టిడ్కో’ లబ్ధిదారులకు ఊరట!

Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో టిడ్కో గృహాల పథకంలో గృహాలు పొందని (అన్సక్సెస్ఫుల్) లబ్దిదారులకు వారు గతంలో చెల్లించిన ప్రభుత్వ వాటా ధనాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది.

మున్సిపల్ కమిషనర్ నెల్లి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లబ్దిదారులకు వారి సొమ్మును చెక్కుల రూపంలో అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నెల్లి రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, వివిధ కారణాల వల్ల టిడ్కో ఇళ్లు దక్కించు కోలేకపోయిన అర్హులైన లబ్ధిదారులందరికీ వారు గతంలో డిపాజిట్ చేసిన వాటా ధనాన్ని పైసా పొరపాటు లేకుండా తిరిగి ఇచ్చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియ అంతా నిబంధనలకు అనుగుణంగా, పూర్తిగా పారదర్శకంగా సాగుతోందని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన లబ్దిదారులు ఉంటే.. తమ ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ వివరాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి, తమ చెక్కులను స్వీకరించాల్సిందిగా కోరారు. లబ్దిదారుల సొమ్మును సకాలంలో తిరిగి అందజేయడంపై స్థానిక ప్రజలు, బాధితులు ప్రభుత్వానికి మరియు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story