Ichchapuram: 11వ వార్డు సచివాలయంలో నూతన పింఛన్ల దరఖాస్తులు

Ichchapuram: ఇచ్ఛాపురం 11వ వార్డు సచివాలయంలో మాజీ కౌన్సిలర్ ఆశి లీలారాణి ఆధ్వర్యంలో అర్హులైన వారికి నూతన పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నిర్వహించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 7 Sept 2026 10:42 PM IST
Ichchapuram
X

Ichchapuram: 11వ వార్డు సచివాలయంలో నూతన పింఛన్ల దరఖాస్తులు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సచివాలయంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ సోమవారం (సెప్టెంబర్ 7) నిర్వహించారు.

11వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆశి లీలారాణి వార్డులోని అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువుల నుంచి వివరాలు సేకరించి, సచివాలయ సిబ్బందితో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేయించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆశి లీలారాణి తెలిపారు.

వార్డు పరిధిలో అర్హత ఉండి పింఛన్ రాని వారు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

సకాలంలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి పింఛన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram

Next Story