Ichchapuram: ఒడిశా నుండి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్
Ichchapuram: ఒడిశా నుంచి బెంగాల్‌కూ 12.5 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను ఇచ్ఛాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
Ichchapuram: ఒడిశా నుండి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్
ఇచ్చాపురం: ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను ఇచ్చాపురం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాయల్ పాల్ మరియు మౌ మఖల్ (అలియాస్ తనీషా) అనే మహిళలు తమ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, పాయల్ పాల్‌కు పరిచయమున్న గంజాయి వ్యాపారి సమీర్ దాస్‌కు తమ సమస్యలను వివరించారు. అందుకు సమీర్ దాస్, తాను చేసే గంజాయి అక్రమ రవాణా వ్యాపారంలో సహకరిస్తే ఒక్కో ట్రిప్పుకు ₹10,000/- చొప్పున ఇస్తానని చెప్పగా వారు అంగీకరించారు.
గతంలో పాయల్ పాల్, సమీర్ దాస్ కలిసి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ అటవీ ప్రాంతం నుండి పలుమార్లు గంజాయిని సరఫరా చేశారు. అయితే పోలీసుల తనిఖీలు గట్టిగా చేపట్టడంతో అక్కడ నుండి కాకుండా ఈసారి ఒడిశా రాష్ట్రం, దిగపహండి పరిధిలోని పద్మనాభపూర్‌కు ముగ్గురూ కలిసి వెళ్లారు. అక్కడ రంజిత్ కుమార్ సాహు అనే గంజాయి వ్యాపారి వద్ద గంజాయిని కొనుగోలు చేశారు.
ఆ గంజాయితో ఇచ్ఛాపురం మీదుగా రైలులో వెళ్లాలని నిర్ణయించుకుని ఇచ్ఛాపురం చేరుకున్నారు. సమీర్ దాస్ రైలు టిక్కెట్లు తీసుకురావడానికి వెళ్లగా, మిగిలిన ఇద్దరు మహిళలు గంజాయి ఉన్న సూట్‌కేసులతో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ లో ఉన్నారు.
రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 12 కిలోల 520 గ్రాముల భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రెండు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చాపురం సీఐ చిన్నమనాయుడు తెలిపారు. గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.




