Ichchapuram: గణనాథుని లడ్డూ వేలం పాటలో రూ. 51,500లకు దక్కించుకున్న ఇందు

Ichchapuram: ఇచ్చాపురం బలరాంపేటలో ఘనంగా వినాయక లడ్డూ వేలం. రూ. 51,500లకు లడ్డూను దక్కించుకున్న బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు ఇందు. ఘనంగా సత్కరించిన కమిటీ సభ్యులు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 25 Sept 2026 8:58 PM IST
Ichchapuram
X

Ichchapuram: గణనాథుని లడ్డూ వేలం పాటలో రూ. 51,500లకు దక్కించుకున్న ఇందు

ఇచ్చాపురం: పట్టణంలోని 22వ వార్డు బలరాంపేటలో గత 11 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన వినాయక నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల చివరి రోజు సందర్భంగా నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలంపాట భక్తుల ఉత్సాహం నడుమ పోటాపోటీగా సాగింది.

ఈ వేలంలో స్థానిక ఇందు బ్యూటీ పార్లర్ ప్రోపరేటర్ శ్రీమతి ఇందు అత్యధికంగా రూ. 51,500 పలికి స్వామివారి ప్రసాద లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ తరఫున వైఎస్సార్సీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు సత్యరాజ్ యాదవ్ లడ్డూ విజేత ఇందును శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వార్డు ప్రముఖులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram