Ichchapuram: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన విప్ అశోక్

Ichchapuram: ఇచ్ఛాపురం మండలం ఇన్నిసుపేటలో రైతులకి ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వెల్లడి.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 3 Oct 2026 9:01 PM IST
Ichchapuram
X

Ichchapuram: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన విప్ అశోక్

ఇచ్ఛాపురం: రైతుల సంక్షేమానికి, వారి భూముల హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ పేర్కొన్నారు. శనివారం ఇచ్చాపురం మండల పరిధిలోని ఇన్నిసుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, పూర్తి పారదర్శకతతో రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భూ వివాదాలకు తావులేకుండా అర్హులైన ప్రతి రైతుకూ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోందని చెప్పారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ దాసరి రాజు, స్థానిక తహశీల్దార్ (MRO), టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బందితో పాటు గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు ఎమ్మెల్యేకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram