Ichchapuram: వైసీపీకి రెబల్ సెగ - స్వతంత్ర అభ్యర్థిగా బొండాడ మహేష్
Ichchapuram: ఇచ్ఛాపురంలో వైసీపీకి రెబల్ సెగ. వార్డుల్లో సీటు కేటాయింపులపై అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సన్నద్ధమవుతున్న బొండాడ మహేష్.
Ichchapuram: వైసీపీకి రెబల్ సెగ - స్వతంత్ర అభ్యర్థిగా బొండాడ మహేష్
ఇచ్ఛాపురం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1983 నాటి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ ఇచ్ఛాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకుడు బోండాడ మహేష్ స్థానికంగా బలమైన నాయకుడిగా ఎదిగాడు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల లో రెండు కీలక బూత్‌లలో పట్టు సాధించి పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ అధిష్టానం సీట్లు కేటాయించనప్పటికీ ఇచ్చాపురం మున్సిపాలిటీ3,4 వార్డుల్లో కేటాయించడంలో బొండాడ మహేష్ నీ పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది అయితే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని అనగదొక్కట కోసం, స్థానికంగా ఉన్న ఒక సంపన్న వ్యక్తికి పార్టీ కండువా కప్పి పదవి పై కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం జోరుగా ఊపందుకోవడంతో, మహేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాక ఎలాగైనా 3,4 వార్డుల్లో రెబల్ గా గెలిచి సత్తా చాటబోతున్నట్టు సన్నిహితుల మాట.!
పెద్దల తీరుపై నిరసన:
ఈ పరిణామాలపై నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో పాటు, మున్సిపల్ పెద్దల దృష్టికి తన అభ్యంతరాలను తీసుకెళ్లినప్పటికీ ఇంచార్జి నుండి సరైన స్పందన రాలేదని తెలిసి ఈ విషయంలో బొండాడ మహేష్ తీవ్ర అసహనానికి గురైనట్లు భోగట్టా. కష్టపడిన కార్యకర్తలను, స్థానిక పట్టున్న నేతలను విస్మరిస్తూ అధిష్ఠానం మరియు నియోజకవర్గం ఇంచార్జి వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు అని సమాచారం.
రెబల్ అభ్యర్థిగా రంగంలోకి?
పెద్దల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన బోండాడ మహేష్, మున్సిపల్ పరిధిలోని 3, 4 వార్డుల్లో స్వతంత్ర (రెబల్) అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తన బలం, ప్రజల్లో ఉన్న ఆదరణే ఆయుధంగా ఈ రెండు వార్డుల్లో బరిలోకి దిగి సత్తా చాటాలని ఆయన యోచిస్తున్నారు. మహేష్ తిరుగుబాటు నిర్ణయం స్థానిక వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతుండగా, ఎన్నికల సమరంలో అధికార పార్టీకి గట్టి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.




