Ichchapuram: ఇచ్చాపురంలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం

Ichchapuram: ఇచ్చాపురంలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ మరియు మంత్రి లోకేష్ రాజీనామా డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Aug 2026 8:58 AM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురంలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్....

ఇచ్చాపురంలో వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం

ఇచ్చాపురం డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఇచ్చాపురంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాత బస్టాండ్ సమీపంలోని కెనరా బ్యాంకు భవనం పై అంతస్తులో గల సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ చర్చా వేదికలో వివిధ అంశాలపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన భృతి అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ టౌన్ హాల్ సమావేశంలో యువత, నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ యూనియన్ల ప్రతినిధులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, వైద్యులు, తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, సాధారణ పౌరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story