Seethampeta: సీతంపేట అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి!
Seethampeta: సీతంపేట మండలంలో పోలీసుల మెరుపు దాడి. 3600 లీటర్ల నాటుసారా బెల్లం ఊటలు ధ్వంసం, 60 ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్న ఎస్సై అమన్నరావు.
Seethampeta: సీతంపేట అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి!
Seethampeta: మండ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో నాటుసారా తయారవుతుందనే సమాచారం మేరకు సీతంపేట ఎస్సై వై. అమన్నరావు ఆధ్వర్యంలో పోలీసులు నాటు సారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడి చేశారు.
నాటు సారా తయా రీకి అవసరమైన 3600 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. బెల్లపు ఊటలను భద్రపరచడానికి ఉపయో గించే 60 ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీన పరుచుకున్నారు. ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నాటు సారా తయారు చేయడం వీటిని మైదాన ప్రాంతాలకు రవాణా చేయడం పట్ల ఎస్సై ప్రత్యేక దృష్టిసారించారు.




