Pathapatnam: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాజారావు మాస్టర్!

Pathapatnam: పాతపట్నం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి రాజారావు మాస్టర్ దూసుకుపోతున్నారు; స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 12 Nov 2026 12:39 PM IST
Pathapatnam
X

Pathapatnam: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాజారావు మాస్టర్!

Pathapatnam: పాతపట్నం మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం లో ఈరోజు శాంతి నగర్ 1,2 , రాంనగర్, హనుమాన్ నగర్, ఆదిత్య నగర్, మహేంద్ర నగర్, వీధులో రాజారావు మాస్టారు పర్యటించారు. ప్రతి వీధుల్లోనున్న సమస్యలను మరియు ఇబ్బందులను పేరుపేరునా అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రతి ఒక్కటి కూడా పని చేసే బాధ్యత నాదని హామీ ఇస్తున్నారు. ఒక మాస్టారుగా ప్రతి విద్యార్థిని క్రమశిక్షణతో ఎలా విద్య నేర్పుతారు అదే క్రమశిక్షణతో ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. రాజారావు మాస్టారు ప్రతి ఒకరితో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు.

ప్రజల సమస్యలు అడిగి మరి తెలుసుకొని వీధుల్లో ఉన్న సమస్యలను మరియు డ్రైనేజీ, త్రాగునీటి, సమస్యలు మాస్టర్ కి చెప్పేరు వాళ్ళకి హామీ కల్పించారు. ఈ క్రమంలో భాగంగా పాతపట్నం తెదేపా సీనియర్ నాయకులు నల్లి రాజారావు మాస్టారు వారి సతీమణి నల్లి సుజాత అలాగే పాతపట్నం తెదేపా సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM