Palakonda: పాలకొండలో యోగా సందడి.. పాల్గొన్న వివిధ శాఖల సిబ్బంది!

Palakonda: పాలకొండలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

KAILASH SAHU, PALAKONDA
Published on: 21 Jun 2026 8:26 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో యోగా సందడి.. పాల్గొన్న వివిధ శాఖల సిబ్బంది!

Palakonda: ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పాలకొండ నగర పంచాయితీ కమీషనర్ శ్రీ పి.వి.నూకరాజు గారి నేత్రృత్వంలో ఆయుష్ డిపార్ట్ మెంట్ వారి ఆద్వర్యంలో పాలకొండ పట్టణంలో వెంకటరాయుని కోనీరు వద్ద గల గాయత్రీ కళ్యాణ మండపంలో ఉదయం 6గంటలకు ఆహ్లాద వాతావరణములో యోగా గురువుగారిచే యోగా క్లాస్ నిర్వహించడం జరిగింది.

వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమములో యోగా గురువులు, పాలకొండ పట్టణంలోగల ఋషి యోగా కేంద్రం సభ్యులు, ట్రైనీలు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, ICDS సిబ్బంది, ఆశావర్కర్లు, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, పట్టణంలోగల 9 సచివాలయముల సెక్రటరీలు, మెప్మా సిబ్బంది, నగర పంచాయితీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story