Mogilipadu: పలాసలో 'ఇంటింటికి కూటమి ప్రభుత్వం' ప్రారంభం!
Mogilipadu: పలాస మొగిలిపాడులో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభం.
Mogilipadu: పలాసలో 'ఇంటింటికి కూటమి ప్రభుత్వం' ప్రారంభం!
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు, మొగిలిపాడు లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని, పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ఆదేశాల మేరకు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా "తల్లికి వందనం" పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందుతోందా, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు సకాలంలో అందుతున్నాయా, అన్నదాత సుఖీభవ వంటి రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరుతున్నాయా, ఇతర ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో నెలకొన్న సమస్యలను అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు.
ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ప్రజా కేంద్రిత పాలన కొనసాగితే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్, జిల్లా పార్లమెంటరీ వైస్ ప్రెసిడెంట్ గాలి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, గురిటి సూర్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




