Palakonda: వినూత్నంగా ‘ఇంటింటికీ... మన్యం పోలీస్’ కార్యక్రమం
Palakonda: ప్రజల చెంతకు పోలీస్ సేవలు అందించేలా పార్వతీపురం మన్యం జిల్లాలో ‘ఇంటింటికీ... మన్యం పోలీస్’ వినూత్న కార్యక్రమం ప్రారంభం.
Palakonda: వినూత్నంగా ‘ఇంటింటికీ... మన్యం పోలీస్’ కార్యక్రమం
పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రతకు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువగా వెళ్లి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, పోలీస్ సేవలు మరియు ప్రజా భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్రం, జిల్లా లోనే మొదటగా రూపొందించిన “ఇంటింటికీ... మన్యం పోలీస్” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పాలకొండ పెద్ద కాపు వీధి లో నిర్వహించారు.
పాలకొండ ఎస్సై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు–చిన్నారుల భద్రత, రోడ్ సేఫ్టీ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ ,ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్స్ తదితర అంశాలపై రూపొందించిన కరపత్రాలను , స్టిక్కర్స్ పాలకొండ పట్టణంలో ప్రజలకు పంపిణీ చేస్తూ వాటి ఆవశ్యకతను విస్తృత అవగాహన కల్పించారు.




