Srikakulam: చీపి పంచాయతీలో వైభవంగా 'ఇంటింటికి తెలుగుదేశం!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపి పంచాయతీలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం. పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు బావన దుర్యోధన.
Srikakulam: చీపి పంచాయతీలో వైభవంగా 'ఇంటింటికి తెలుగుదేశం!
Srikakulam: మందస మండలం చీపి గ్రామ పంచాయతీ పరిధిలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందస మండల పార్టీ అధ్యక్షులు శ్రీ బావన దుర్యోధన గారు ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పార్టీ నాయకత్వ లక్ష్యాలను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ, గ్రామాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులతో పాటు క్లస్టర్ ఇంచార్జీ చంద్రశేఖర్ ముంజేటి,
యూనిట్ కన్వీనర్ పాండా డెబిసిస్, ముఖ్య నాయకులు రట్టి లింగరాజు, నవీన్ యాదవ్, రమో, జగదీశ్ యాజక వీరితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .




