Parvathipuram: సీతంపేటలో 103 మందికి ల్యాండ్ సర్టిఫికెట్ల పంపిణీ!
Parvathipuram: పార్వతీపురం మన్యం సీతంపేటలో PM-JANMAN పథకం కింద 103 మంది ఆదివాసీ లబ్ధిదారులకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్.
Parvathipuram: సీతంపేటలో 103 మందికి ల్యాండ్ సర్టిఫికెట్ల పంపిణీ!
Parvathipuram: పార్వతిపురం మన్యం జిల్లా సీతంపేట ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణానికి సంబంధించి 103 మంది గృహ లబ్ధిదారులకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లను ఐటిడిఏ పీవో పవార్ స్వప్నిల్ అందజేశారు. లబ్ధిదారులకు భూమికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అందడంతో గృహ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఫారెస్ట్ స్థలాలు కావడంతో అటవీ శాఖతో ఇబ్బందులు రాకుండా ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లను అందజేసినట్లు పీవో తెలిపారు.
కార్యక్రమంలో ఏపీవో జి. చిన్నబాబు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ సిబ్బంది జగదీష్, మధు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




