Kanchili: కర్తలి గ్రామంలో ఘనంగా 'ఎన్టీఆర్ భరోసా పింఛన్ల' పంపిణీ!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కర్తలిలో ఐటీడీపీ అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 30 July 2026 9:58 PM IST
Kanchili
X

Kanchili: కర్తలి గ్రామంలో ఘనంగా 'ఎన్టీఆర్ భరోసా పింఛన్ల' పంపిణీ!

కంచిలి: కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ కర్తలి గ్రామంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కంచిలి మండల ఐటీడీపీ అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

విమానాశ్రయం నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పింఛన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story