Palakonda: పాలకొండలో వైస్సార్సీపీ ‘జగన్ 2.ఓ యాప్’ లాంచ్

Palakonda: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జగన్ 2.ఓ సూపర్ యాప్’ను పాలకొండలో శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ఆవిష్కరించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 19 July 2026 1:09 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో వైస్సార్సీపీ ‘జగన్ 2.ఓ యాప్’ లాంచ్

Palakonda: పాలకొండ పట్టణంలో వైస్సార్సీపీ కార్యాలయంలో జగన్‌ 2.ఓ సూపర్‌ యాప్‌’ను పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సోషల్‌ మీడియాలో వై.యస్.ఆర్.సి.పి వాళ్లు పోస్ట్‌ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్‌ చేయడం,

అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం..ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ

వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశంతో పార్టీనే ఒక యాప్‌ తీసుకొచ్చింది.అదే జగన్‌ 2.ఓ సూపర్‌ యాప్‌.దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు.అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారు.ఇది మన యాప్‌ కాబట్టి మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్‌ చేసే హక్కు కూడా వారికి ఉండదు.ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలను కూడా తిప్పి కొట్టవచ్చు అన్నారు.

ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు,పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటారు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది.కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ,ఈ యాప్‌ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్‌లో ఉండే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ యాప్‌లో మరో మంచి అంశం ఏమిటంటే,పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్‌మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్‌ ఫీడ్‌ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎక్కడైనా,ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్‌లో పోస్ట్‌ చేయడం,ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది.

పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు,ఇంకా రాజకీయ వేధింపులకు గురవుతున్న వారు కూడా ఇప్పుడు డిజిటల్‌ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు ఆ డైరీ కూడా ఈ యాప్‌తో అనుసంధానం అవుతుంది. అంటే ఈ యాప్‌లో ఆ డిజిటల్‌ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది.దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్‌ ద్వారా డిజిటల్‌ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చు.ఆ వివరాలు నమోదు చేయొచ్చు.

ఈ జగన్ 2.ఓ సూపర్ యాప్‌ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటారని విక్రాంత్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీరఘట్టం ఎంపీపీ శ్రీ ధమలపాటి వెంకటరమణ నాయుడ గారు, టౌన్ అధ్యక్షులు వెలమల మన్మథరావు గారు పాలకొండ మండల కన్వీనర్ కణపాక సూర్యప్రకాశరావు గారు, మాజీ కౌన్సిలర్ లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story