Srikakulam: కార్యకర్తలకు రక్షణ కవచం 'జగన్ 2.0' శ్రీకాకుళంలో యాప్ లాంచ్!
Srikakulam: శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ 'జగన్ 2.0 సూపర్ యాప్' పోస్టర్ ఆవిష్కరణ. కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు పార్టీ అధినేత జగన్ భరోసా.
Srikakulam: కార్యకర్తలకు రక్షణ కవచం 'జగన్ 2.0' శ్రీకాకుళంలో యాప్ లాంచ్!
Srikakulam: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానం చేసే లక్ష్యంతో అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’ జిల్లా స్థాయి ప్రచార కార్యక్రమం శ్రీకాకుళంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్' వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఈ జగన్ 2.O సూపర్ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న కార్యకర్త మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తల వాయిస్‌ను అణచివేయాలని చూస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి, సమాచార మార్పిడితో పాటు పోలీసు, రాజకీయ వేధింపులపై నేరుగా డిజిటల్ డైరీ ద్వారా ఫిర్యాదు చేసుకునేందుకు ఈ సొంత ప్లాట్‌ఫామ్ రక్షణగా నిలుస్తుందని వివరించారు.
జిల్లాలోని నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ మరియు ప్రతి ఒక్క కార్యకర్త ఈ సరికొత్త ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను డౌన్లోడ్ చేసుకుని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, యువ నాయకులు ధర్మాన రామమనోహర్ నాయుడు జిల్లా పార్టీ ముఖ్య నాయకులు భారీగా పాల్గొన్నారు.




