Jalumuru: శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఘనంగా వరుణ యాగం
Jalumuru: జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు.
Jalumuru: శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఘనంగా వరుణ యాగం
జలుమూరు: రాష్ట్రం పచ్చని పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, రైతాంగం సుభిక్షంగా ఉండటంతో పాటు ప్రజలకు సాగు, తాగునీటి కొరత తలెత్తకూడదని ఆకాంక్షిస్తూ జలుమూరు మండలంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష వరుణ యాగం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.సకాలంలో వర్షాలు కురిసి, జలాశయాలు జలకళతో సంతరించుకోవాలని, సకల జనులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుతూ వేద పండితులు, అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
"రైతాంగం సుభిక్షంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోకుండా, భూగర్భ జలాలు వృద్ధి చెంది ప్రజలందరికీ తాగునీరు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ యాగం తలపెట్టామని,శ్రీముఖలింగేశ్వర స్వామివారి కృపాకటాక్షాలతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, లోకమంతా శాంతిసౌఖ్యాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం గారు, వంశధార డిస్ట్రిబ్యూటరి కమిటీ చైర్మన్ కింజరాపు సత్యనారాయణ గారు, యూనిట్ ఇన్చార్జ్లు గుండ మన్మధరావు గారు, తమన్నగారి సతీష్ కుమార్ గారు,పొదిలాపు వేణుగోపాలరావు గారు,దేవా గారు, దేవస్థానం ఛైర్మన్, పాలకమండలి సభ్యులు,ఈవో గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




