Srikakulam: అరసవల్లిలో కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి ప్రచారం!

Srikakulam: శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి ఆధ్వర్యంలో జనసేన నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించి, గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 14 Nov 2026 11:16 AM IST
Srikakulam
X

Srikakulam: అరసవల్లిలో కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి ప్రచారం!

Srikakulam: అడుగుడుగునా ఆద‌ర‌ణ‌ అనంత‌రం జ‌న‌సేన నాయ‌కురాలు మోహ‌న‌ల‌క్ష్మీ ఆధ్వ‌ర్యంలో అర‌స‌వ‌ల్లిలోని 3,6 వార్డుల్లో ప‌ర్య‌టించి ప్ర‌చారం నిర్వ‌హించారు. స్థానిక ప్ర‌జ‌లు దానేటి దంప‌తుల‌ను అడుగ‌డుగునా ఆద‌రించి మంగ‌ళ‌హార‌తుల‌తో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

పూల‌వ‌ర్షం కురిపించి త‌మ‌ అభిమానం చాటుకున్నారు. జై జ‌న‌సేన‌... జైజై దానేటి అంటూ నినాదాలు చేశారు. డ‌ప్పుల చ‌ప్పుళ్లు యువ‌త కేరింత‌ల న‌డుమ సాగిన ఈ ప్ర‌చారంలో పెద్ద ఎత్తున యువ‌త‌, మ‌హిళ‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి పార్టీ మేయ‌ర్ అభ్య‌ర్థి దానేటి రాధారాణి మాట్లాడుతూ ఆద‌రించండి... గెలిపించండి. అభివృద్ధికి స‌హ‌క‌రించండని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించారు.

ఎన్నో ఏళ్లుగా శ్రీ‌కాకుళం న‌గ‌రంలో పెద్ద ఎత్తున స‌మ‌స్య‌లు పేరుకుపోయింద‌ని న‌గ‌ర అభివృద్ధిని కాంక్షించే వారంతా త‌న‌కు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌ణాళికతో తాను గెలిచిన 100 రోజుల్లోనే న‌గ‌రంలోని స‌మ‌స్య‌ల‌ను ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌న్నారు.

రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కారు పాల‌న‌లో అన్ని రంగాల్లో అభివృద్ధి క‌న్పిస్తోందని రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పేందుకు పెట్టుబ‌డిదారుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు చూస్తున్నార‌ని తెలిపారు. శ్రీ‌కాకుళం న‌గ‌రంలో కూడా ట్రిపుల్ ఇంజిన్ స‌ర్కారు అభ్య‌ర్థి మేయ‌ర్‌గా గెలిస్తే శ్రీ‌కాకుళాన్ని స్వ‌ర్ణ‌, స్వచ్ఛ శ్రీ‌కాకుళంగా మార్చేందుకు అంద‌ర‌మూ భాగ‌స్వామ్యుల‌మ‌వుదామ‌ని కోరారు.

మీ అమూల్య‌మైన ఓటును గ్లాస్ గుర్తుపై ఓటు వేసి త‌న‌ను మేయ‌ర్‌గా గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. దానేటి శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ప్ర‌తీ వార్డులో జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటికి ప‌రిష్క‌రించే దిశ‌గా కృషి చేస్తామ‌ని హామినిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ , జనసేన, బిజెపి మ‌హిళ‌లు, యువ‌త పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.