Kanchili: కంచిలిలో టీడీపీకి మరింత బలం: వైసీపీని వీడి సైకిలెక్కిన మాజీ ఎంపీటీసీ

Kanchili: కంచిలి మండల కేంద్రం బీపీ కాలనీకి చెందిన మాజీ ఎంపీటీసీ కొత్తకోట చంద్రశేఖర్‌తో పాటు 40 కుటుంబాలు మాదిన రామారావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి.

G.RAMBABU, SOMPET
Published on: 20 Oct 2026 6:29 PM IST
Kanchili
X

Kanchili: కంచిలిలో టీడీపీకి మరింత బలం: వైసీపీని వీడి సైకిలెక్కిన మాజీ ఎంపీటీసీ

కంచిలి: కంచిలి మండల కేంద్రంలోని బీపీ కాలనీకి చెందిన మాజీ ఎంపీటీసీ, సీనియర్‌ వైసీపీ నాయకుడు కొత్తకోట చంద్రశేఖర్‌ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ అభ్యర్థి మాదిన రామారావు ఆధ్వర్యంలో ఆయనతోపాటు మరో నలభై కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నారు.

మాజీ ఎంపీటీసీగా, సీనియర్‌ నాయకుడిగా స్థానిక రాజకీయాల్లో గుర్తింపు ఉన్న చంద్రశేఖర్‌ టీడీపీలో చేరడం మండల రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ నాయకుడి చేరికతో కంచిలిలో టీడీపీ శ్రేణులకు మరింత బలం చేకూరినట్లయింది.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి మద్దిల ఆనంద్,మద్దిల కేశవయ్య,పైల పురుషోత్తంరెడ్డి బొడ్డ హరిబాబు,మద్దిల భాస్కర రావు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET