Kanchili: మకరాంపురం వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు.. ఆందోళన
Kanchili: కంచిలి మండలం మకరాంపురం గ్రామం NH-16 వద్ద తరచూ ప్రమాదాలు. ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆవేదన. సొంత ఖర్చులతో రోడ్డు క్లీన్ చేయించిన ధర్మకర్త.
Kanchili: మకరాంపురం వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు.. ఆందోళన
కంచిలి: కంచిలి మండలంలోని మకరాంపురం గ్రామం, ఆదివారం సంత వద్ద ఎన్హెచ్ - 16 పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 50కి పైగా యాక్సిడెంట్లు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చుట్టుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలు, పాఠశాల పిల్లల తిరుగుబాటు, ఆదివారం సంతలో జనసందోహం అధికంగా ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్హెచ్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ప్రాంతంలో వీధి దీపాలు లేకపోవడం, సర్వీస్ రోడ్డుపై వర్షం పడితే బురదగా మారి వాహనదారులు పడిపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిపై స్పందించిన మకరాంపురం గ్రామ శిరిడి సాయి ఆలయ ధర్మకర్త రమణ సాయి తన సొంత ఖర్చుతో సర్వీస్ రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని జేసీబీ సాయంతో తొలగించారు.
బూరదమయంగా మారిన రోడ్డును చదును చేయించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉండకుండా గ్రావెల్ వేసి రోడ్డును శుభ్రంగా చేయాలని, సైనేజ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ అధికారులను కోరుతున్నారు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.




