Kanchili: జాడుపూడిలో 100% ఓటరు జాబితా సవరణ పూర్తి: బీఎల్ఓల ఘన సన్మానం!
Kanchili: కంచిలి మండలం జాడుపూడి సచివాలయ పరిధిలో ఓటరు జాబితా సవరణ (SIR) వంద శాతం పూర్తి. టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు ఆధ్వర్యంలో బీఎల్ఓల సన్మానం.
Kanchili: జాడుపూడిలో 100% ఓటరు జాబితా సవరణ పూర్తి: బీఎల్ఓల ఘన సన్మానం!
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి సచివాలయ పరిధి పెద్దకొజ్జిరియా గ్రామపంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల వివరాల డిజిటలీకరణ, ధ్రువీకరణ ప్రక్రియ శతశాతం పూర్తైంది. ఈ సందర్భంగా జాడుపూడి సచివాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాదిన రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఎలు, బీఎల్వోలను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఓటరు జాబితా ఖచ్చితత్వాన్ని పెంపొందించడంలో బీఎల్ఎలు, బీఎల్ఓ, సచివాలయ సిబ్బంది సమష్టిగా కృషి చేశారని ప్రశంసించారు. అనంతరం బీఎల్ఓ సుశీలను మరియు బిఎల్ఏ లు బొడ్డ రామకుమార్,ప్రధాన లజపతిరాయ్, బొడ్డ పృథ్వీ బాబు లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో హరిబాబు,ఆనంద్,చిన్నబాబు,ధర్మ యాదవ్ మరియు జాడుపూడి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




