Kanchili: ప్రధాన రహదారి, డ్రైనేజీ సమస్యపై కేంద్ర మంత్రికి వినతి
Kanchili: కంచిలి ప్రధాన రహదారి అభివృద్ధి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు తెదేపా, జనసేన నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
Kanchili: ప్రధాన రహదారి, డ్రైనేజీ సమస్యపై కేంద్ర మంత్రికి వినతి
కంచిలి: కంచిలి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అభివృద్ధితో పాటు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ టీడీపీ నాయకులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును కోరారు. ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు, నియోజకవర్గ జనసేన ఇంచార్జీ దాసరి రాజు సమక్షంలో మండల టీడీపీ అధ్యక్షులు మాదిన రామారావు, జగదీష్ పట్నాయక్, బంగారు కురయ్య తదితర నాయకులు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.
కంచిలి ప్రధాన రహదారిపై డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో నీరు నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన రహదారి అభివృద్ధితో పాటు శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కంచిలి మండల కేంద్రం కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రధాన రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారని, రహదారి అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడితే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తెదేపా పార్టీ అధ్యక్షులు మాదిన రామారావు, జగదీష్ పట్నాయక్, బంగారు కురయ్య,టివి రమణ,కొర్రాయి కురయ్య,కాశీ విశ్వనాధం తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కంచిలి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అభివృద్ధితో పాటు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ టీడీపీ నాయకులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును కోరారు. ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు, నియోజకవర్గ జనసేన ఇంచార్జీ దాసరి రాజు సమక్షంలో మండల టీడీపీ అధ్యక్షులు మాదిన రామారావు, జగదీష్ పట్నాయక్, బంగారు కురయ్య తదితర నాయకులు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.కంచిలి ప్రధాన రహదారిపై డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో నీరు నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన రహదారి అభివృద్ధితో పాటు శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.