Kanchili: కంచిలి అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో రోడ్లు, డ్రైనేజీలు కమ్యూనిటీ మండపాల నిర్మాణం చేపట్టాలని కోరుతూ రామ్మోహన్, ఎమ్మెల్యే అశోక్‌కు టీడీపీ నేతలు వినతిపత్రం.
Kanchili: కంచిలి అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి
Kanchili: కంచిలి మండలంలో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ మండపాల నిర్మాణం చేపట్టి మండలాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిటి మండలం రామయ్యపుట్టుగలో శనివారం చేపట్టిన ప్రజా దర్బార్ వేదికలో టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు ఆధ్వర్యంలో మండల నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేను కలిసి సమస్యలను వివరించారు.
పలు గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంటోందని, మండపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం స్వీకరించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే మండలంలో రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికే పెద్దపీట వేస్తోందని, కంచిలి మండలంలో దశలవారీగా రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిధులు మంజూరు చేసి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పైల రామారావు, పాడి కిషోర్, మండలంలోని 31 పంచాయతీల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




