Kanchili: శ్రీకృష్ణ దేవాలయంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రత్యేక పూజలు

Kanchili: కంచిలి శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ నర్తు రామారావు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 4 Sept 2026 8:11 PM IST
Kanchili
X

Kanchili: శ్రీకృష్ణ దేవాలయంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రత్యేక పూజలు

కంచిలి: కంచిలి మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.

జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణ చేశారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నర్తు రామారావు మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ధర్మాన్ని ఆచరించడం, సత్యమార్గంలో నడవడం ద్వారా శ్రీకృష్ణుడి సందేశాన్ని జీవితంలో పాటించాలని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి కృపతో ప్రజలందరికీ శాంతి, సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ సతీమణి నర్తు చామంతి, తనయుడు నర్తు శివాజీతోపాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story