Kanchili: పదవీకాలం ముగిసిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ

Kanchili: కంచిలి ఎంపీపీగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న పైల దేవదాస్‌రెడ్డి. సుమారు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి, ప్రజలకు కృతజ్ఞతలు.

G.RAMBABU, SOMPET
Published on: 23 Sept 2026 9:03 PM IST
Kanchili
X

Kanchili: పదవీకాలం ముగిసిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ

కంచిలి: కంచిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తన ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా పైల దేవదాస్‌రెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో ప్రజలకు అందుబాటులో ఉంటూ తన బాధ్యతలను నిర్వర్తించానని పేర్కొన్నారు.

ఎంపీటీసీలు, సర్పంచ్‌ల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. మండల ప్రజా పరిషత్ ద్వారా రూ.5 కోట్లు, జీజీఎంపీ ద్వారా రూ.3 కోట్లు, జిల్లా పరిషత్ ద్వారా రూ.కోటి నిధులతో పాటు ఉపాధి హామీ, నాడు–నేడు, ఏఐఐబీ, ఆర్‌అండ్‌బీ తదితర నిధులతో కలిపి సుమారు రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.

తనపై నమ్మకంతో ఎంపీపీగా ఎన్నుకున్న ఎంపీటీసీలు, సహకరించిన సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులు, మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన వల్ల తెలిసీ తెలియక ఎవరైనా ఇబ్బందికి గురై ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET