Kanchili: చిన్నకొజ్జిరియాలో వైభవంగా వరసిద్ధి వినాయక కుంకుమార్చన

Kanchili: కంచిలి మండలం చిన్నకొజ్జిరియాలో ఘనంగా వరసిద్ధి వినాయక 30వ వార్షికోత్సవాలు. భక్తిశ్రద్ధలతో పాల్గొని కుంకుమార్చన నిర్వహించిన మహిళలు.

G.RAMBABU, SOMPET
Published on: 16 Sept 2026 11:53 PM IST
Kanchili
X

Kanchili: చిన్నకొజ్జిరియాలో వైభవంగా వరసిద్ధి వినాయక కుంకుమార్చన

కంచిలి: కంచిలి భక్తి పరిమళాలు వెదజల్లుతూ.. వినాయక నామస్మరణ మార్మోగుతూ.. సుమంగళుల కుంకుమార్చనతో కంచిలి మండలం చిన్నకొజ్జిరియా గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి 30వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన కుంకుమ పూజలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి.

వరసిద్ధి వినాయకుని సన్నిధిలో మహిళలు సంప్రదాయబద్ధంగా కుంకుమార్చన నిర్వహించి స్వామివారిని భక్తితో కొలిచారు. సుమారు 30 జంటలు ప్రత్యేక పూజల్లో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరుకున్నారు. పూజా మంత్రోచ్ఛారణలు, వినాయక నామస్మరణతో ఉత్సవ ప్రాంగణం భక్తిమయంగా మారింది. కుటుంబాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని భక్తులు స్వామివారిని ప్రార్థించారు.

మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉత్సవ సంప్రదాయంలో 30వ వార్షికోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చనకు మహిళలు ఉత్సాహంగా హాజరై పూజలు చేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

గ్రామ పెద్దలు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో కుంకుమ పూజా కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET