Kanchili: బడికి దూరమైన పిల్లలపై కంచిలి అధికారుల ఫోకస్

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల పరిధిలో బడిబాట పట్టని “నెవర్ ఎన్రోల్డ్” పిల్లల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

G.RAMBABU, SOMPET
Published on: 26 May 2026 7:15 AM IST
Kanchili
X

Kanchili: బడికి దూరమైన పిల్లలపై కంచిలి అధికారుల ఫోకస్

Kanchili: పాఠశాలకు ఎప్పుడూ హాజరుకాని “నెవర్ ఎన్రోల్డ్” పిల్లలను గుర్తించి వారికి విద్య అందించే లక్ష్యంతో కంచిలి మండల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండలంలోని గ్రామాల్లో ఇప్పటివరకు బడిలో చేరని చిన్నారులను గుర్తించి, వారి తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహించి, విద్యకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి వెంటనే బడుల్లో చేర్పించే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమలరావు, మండల స్పెషల్ ఆఫీసర్ అప్పలస్వామి, తహసిల్దార్ రమేష్, మండల విద్యాశాఖ అధికారులు శివరామ్ ప్రసాద్, చిట్టిబాబుతో పాటు మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story