Kanchili: కంచిలిలో ఘనంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
Kanchili: కంచిలి మండలం ప్రధానపుట్టుగ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం. సంక్షేమ పథకాలను వివరించిన నాయకులు.
Kanchili: కంచిలిలో ఘనంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
కంచిలి: కంచిలి మండలం తలతంపర పంచాయతీ పరిధిలోని ప్రధానపుట్టుగ గ్రామంలో సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా మండల అధ్యక్షుడు మాదిన రామారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన అంశాలను ప్రజలకు వివరించి, సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మండల యువజన అధ్యక్షుడు మద్దిల ఆనందరావు, తలతంపర పంచాయతీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జగబంధు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ లైవ్‌స్టాక్ డైరెక్టర్ మర్రిపాటి పూర్ణ, ఏఎంసీ డైరెక్టర్ అభిమన్యు బిసాయి, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




