Kanchili: ఎంఎస్ పల్లి – కొల్లూరు పరిధిలో రైతులకు విత్తనాల అందజేత
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎంఎస్ పల్లి – కొల్లూరు పంచాయతీ పరిధిలో ఖరీఫ్ సీజన్ ముందస్తు విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
Kanchili: ఎంఎస్ పల్లి – కొల్లూరు పరిధిలో రైతులకు విత్తనాల అందజేత
Kanchili: కంచిలి ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా కంచిలి మండలం ఎంఎస్ పల్లి – కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదిన రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాల ఎంపిక అత్యంత కీలకమని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ శాస్త్రీయ సలహాలతో సాగు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. సాగు ప్రారంభ దశలోనే విత్తనాల పంపిణీ జరగడం వల్ల రైతులకు సమయానుకూలంగా పంటల సాగు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కిషోర్, సూర్యనారాయణ రెడ్డి, వి రమేష్ రెడ్డి, శ్రీకాంత్, మణి, భాస్కర్,బుడ్డెపు శ్రీరాములు తదితర గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.




