Kanchili: భైరిపురం జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం

Kanchili: కంచిలి మండలం భైరిపురం జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి వేడుకలు నిర్వహించి, ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు.

G.RAMBABU, SOMPET
Published on: 2 Oct 2026 9:07 PM IST
Kanchili
X

Kanchili: భైరిపురం జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం

కంచిలి: కంచిలి మండలం భైరిపురం జంక్షన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఘనంగా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులను దుశ్శాలువలతో సన్మానించారు.

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ బీసీ విభాగ కార్యదర్శి నరేంద్ర యాదవ్, మాజీ ఎంపీపీలు దేవదాసు రెడ్డి, నిమ్మన దాసు, బోర పుష్ప, వైకాపా కంచిలి మండల అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు, పార్టీ నేతలు ధర్మారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET