Kanchili: కంచిలిలో వైఎస్సార్సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకుల విస్తృత ఎన్నికల ప్రచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థన.
Kanchili: కంచిలిలో వైఎస్సార్సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం
కంచిలి: కంచిలి మండల కేంద్రంలో గొల్ల కంచిలి లో వైసీపీ అభ్యర్థులు సోమవారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సాగిన ప్రచారంతో ఎన్నికల సందడి నెలకొంది.
వైసీపీ ఎంపీపీ అభ్యర్థి పైలా దేవదాస్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి ఇప్పిలి కృష్ణారావు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.
కంచిలి టౌన్-1 ఎంపీటీసీ అభ్యర్థి బదకల ధర్మారావు, గొల్ల కంచిలి లో ప్రచారంలో పాల్గొని ఇంటింటికి ప్రచారం సేసారు . స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లి ఈశ్వరరావు, గుమ్మడి రామదాసు, దుబ్బ రామా రావు, డొక్కరి దాలయ్య, దుబ్బ లోకం,కొల్లి వెంకీ,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




