Kanchili: కంచిలి మండలంలో హోరెత్తిన వైయస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం!
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో ఘనంగా సాగిన వైసీపీ ఎంపీపీ, జడ్పీటీసి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు.
Kanchili: కంచిలి మండలంలో హోరెత్తిన వైయస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం!
Kanchili: కంచిలి మండల కేంద్రంలో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఆదివారం రోజంతా హోరెత్తింది. కంచిలి మెయిన్‌రోడ్డులో వైసీపీ ఎంపీపీ అభ్యర్థి పైల దేవదాస్ రెడ్డి, వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇప్పిలి కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ ప్రచారం నిర్వహించారు. కంచిలి టౌన్ -1 ఎంపీటీసీ అభ్యర్థి బదకల ధర్మారావు, కంచిలి టౌన్ -2 ఎంపీటీసీ అభ్యర్థి సోమేశ్వరరావు చౌదరి ప్రచారంలో పాల్గొన్నారు. వ్యాపార సముదాయాలు, దుకాణాల వద్దకు నేరుగా వెళ్లి వ్యాపారులను, ప్రజలను, ఓటర్లను కలుసుకున్నారు. తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మెయిన్‌రోడ్డులో సాగిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీపీ అభ్యర్థి పైల దేవదాస్ రెడ్డి మాట్లాడుతూ "కంచిలి మండల అభివృద్ధే నా లక్ష్యం. గతంలో ఎంపీపీగా ఉన్నప్పుడు మండలంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశాను. ఇప్పుడు కూడా ప్రజల ఆశీస్సులతో మరోసారి అవకాశం ఇస్తే, మండలంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తా. ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది. వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తా" అని అన్నారు.
వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇప్పిలి కృష్ణారావు మాట్లాడుతూ "జిల్లా పరిషత్ ద్వారా కంచిలి మండలానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. గ్రామాల్లో రోడ్లు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలే నా ప్రధాన అజెండా. యువతకు ఉపాధి, రైతులకు అండగా నిలవడం, మహిళల సంక్షేమం కోసం పని చేస్తా. వైసీపీ నాయకులందరూ కలిసికట్టుగా ఉంటేనే మండలం అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ ఓటు అభివృద్ధికి వేయండి, ఫ్యాన్ గుర్తుకు వేయండి" అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ కొల్లి ఈశ్వర్రావు, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ గుమ్మడి రామదాస్, మాజీ సర్పంచ్ డొక్కరి బలరాంతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




