Kaviti: కవిటిలో ఘనంగా చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకలు
Kaviti: కవిటి మండలం ప్రగడ పుట్టుగ కోదండ రామాలయంలో చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకలు. ప్రత్యేక పాదపూజ, అష్టోత్తర శతనామావళి మరియు శోభాయాత్ర.
Kaviti: కవిటిలో ఘనంగా చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకలు
కవిటి: కవిటిలోని ప్రగడ పుట్టుగ గ్రామంలో శ్రీ కోదండ రామాలయం చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవ వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు.
తొలుత స్వామివారి పాదపూజ నిర్వహించి, అష్టోత్తర శతనామావళితో ప్రత్యేక అర్చనలు సమర్పించారు. అనంతరం స్వామివారి చిత్రపటంతో శోభాయాత్ర చేపట్టగా, భక్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. భక్తుల నామస్మరణల మధ్య శోభాయాత్ర కొనసాగింది.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో స్వామివారి శిష్య బృందానికి చెందిన బల్లెడ శాంతారాం, బల్లెడ ప్రవీణ్, బల్లెడ మన్మధరావుతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




